తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించే సాగు మల్బరీ సాగు : మంత్రి హరీశ్‌

byసూర్య | Mon, Jun 07, 2021, 11:56 AM

వ్యవసాయ రంగంలో రైతులు నూతన పద్ధతులను అవలంభించాలని, దీనివల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించొచ్చని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ప్రభుత్వం, హార్టికల్చర్‌ అధికారుల ప్రోత్సాహంతో జిల్లాలో మల్బరీ తోటల సాగు మూడు పూలు, ఆరు కాయలుగా సాగుతుందని మంత్రి చెప్పారు. జిల్లాలోని చిన్నకోడూరు మండలం చందలాపూర్‌లో రైతులు ఉమాపతి, ప్రభాకర్‌ల వ్యవసాయ క్షేత్రాల్లో మల్బరీ మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. చందలాపూర్‌లో మల్బరీ తోటల సాగును విరివిగా చేపట్టాలని సూచించారు.


హార్టికల్చర్‌ అధికారుల సూచనలు పాటిస్తూ మల్బరీ పంట సాగు చేస్తే తక్కువ శ్రమ, పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించొచ్చని చెప్పారు. మల్బరీ తోట సాగు చేస్తున్న రైతులు కూడా ఇదే చెప్తున్నారని మంత్రి అన్నారు. అనంతరం జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో మల్బరీ సాగు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల సర్పంచ్‌లు, ఏంపీటీసీలు, గ్రామ, మండలాల ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM