ట్రైనీ ఐపీఎస్‌ అధికారుల సాహసంపై నెటిజన్లు ప్రశంసలు

byసూర్య | Mon, Jun 07, 2021, 10:56 AM

హైదరాబాద్‌ నగరంలోని సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీ (ఎస్‌వీపీఎన్‌పీఏ)లో శిక్షణ పొందుతున్న ట్రైనీ ఐపీఎస్‌లు సముద్రంలో మునిగిపోతున్న ఓ కుటుంబాన్ని కాపాడి వారి పాలిట ఆపద్భాందవులు అయ్యారు. ఎన్‌పీఏలోని ట్రైనీ ఐపీఎస్‌లు అభినవ్‌ ధీమాన్, అభినయ్‌ విశ్వకర్మ, భరత్‌ సోనీ, గౌహర్‌ హసన్, సువేందు పాత్ర, తెషూ లెందీప్‌ (భూటాన్‌ ) అహ్మద్‌ అబ్దుల్‌ అజీజ్‌ (మాల్దీవులు), మహమ్మద్‌ నజీవ్‌ (మాల్దీవులు) భారత్‌యాత్ర కార్యక్రమం కోసం ఇటీవల లక్షద్వీప్‌ దీవులకు వెళ్లారు. అక్కడ వీరంతా బీచ్‌లో గడుపుతున్న సమయంలో భారత వైమానిక దళానికి చెందిన ఓ అధికారి కుటుంబం ప్రమాదవశాత్తూ సముద్రంలో మునిగిపోతుండటం చూశారు. వెంటనే ఈ ఎనిమిది మంది సముద్రంలోకి దూకి వారందర్నీ రక్షించారు. విషయం తెలిసిన అకాడమీ వీరి ధైర్య సాహసాలను ఆదివారం ప్రత్యేకంగా అభినందించి మీడియాకు వెల్లడించింది. ట్రైనీ ఐపీఎస్‌ అధికారుల సాహసంపై నెటిజన్లు ప్రశంసల వెల్లువ కురిపిస్తున్నారు.


Latest News
 

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:33 PM