ఈటల 'తన గొడవల కోసం పదేపదే నా పేరు ప్రస్తావించడం.. ఈటల భావదారిద్ర్యానికి నిదర్శనం'' : మంత్రి హరీశ్ రావు

byసూర్య | Sun, Jun 06, 2021, 10:05 AM

రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై ఆర్థికమంత్రి హరీశ్ రావు స్పందించారు. తనపై ఈటల చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఈటల పార్టీని వీడటానికి అనేక కారణాలు ఉండొచ్చని, పార్టీలో ఉండాలా.. పోవాలా అన్నది ఆయన ఇష్టమన్నారు. తన భుజం మీద తుపాకీ పెట్టి కాల్చాలనుకోవడం విఫలప్రయత్నమన్నారు. ఈటల పార్టీకి చేసిన సేవకన్నా.. పార్టీ ఆయనకిచ్చింది ఎక్కువని పేర్కొన్నారు. కేసీఆర్‌ తనకు మార్గదర్శి అని, తండ్రి కంటే ఎక్కువ అన్నారు. కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు టీఆర్‌ఎస్‌లోనే ఉంటానన్నారు. తాచెడ్డ కోతి వనమంతా చెరిచిందన్నట్లు ఈటల వైఖరి ఉందని విమర్శించారు. ఈటల పార్టీని వీడినా టీఆర్‌ఎస్‌కు వచ్చే నష్టమేమీ లేదన్నారు. తనకు పార్టీ ప్రయోజనాలే పరమావధి అని, నాయకత్వం ఏ పని అప్పగించినా పూర్తి చేయడం తన విధి అన్నారు. ''తన గొడవలకు నైతిక బలం కోసం పదేపదే నా పేరు ప్రస్తావించడం.. ఈటల భావదారిద్ర్యానికి నిదర్శనం'' అంటూ హరీశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


Latest News
 

గంజాయిని పట్టుకున్న ఎస్ఓటి పోలీసులు Sat, Apr 20, 2024, 12:34 PM
ధర్మపురి అరవింద్ ను గెలిపించాలని ప్రచారం Sat, Apr 20, 2024, 12:32 PM
విద్యార్థులు మానసికంగా దృఢంగా ఉండాలి: సంక్షేమఅధికారి బావయ్య Sat, Apr 20, 2024, 12:30 PM
వైభవంగా పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణం Sat, Apr 20, 2024, 12:29 PM
కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరిక Sat, Apr 20, 2024, 12:26 PM