తెలంగాణ లోకి ప్రవేశించిన నైరుతి..తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు

byసూర్య | Sun, Jun 06, 2021, 10:00 AM

నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించాయి. కేరళ రాష్ట్రాన్ని తాకిన తర్వాత..తెలుగు రాష్ట్రాల్లో కొంత ఆలస్యంగా రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. కానీ..శరవేగంగా తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించాయి. 2021, జూన్ 05వ తేదీ శనివారం వనపర్తి, నాగర్ కర్నూలుతో పాటు..మహబూబ్ నగర్ జిల్లాలోకి ప్రవేశించాయి. జూన్ 05వ తేదీ కల్లా…తెలంగాణలో ప్రవేశించడం గత మూడేళ్లలో ఇదే తొలిసారి. అయితే ఇంకో విషయం ఏంటంటే .. బంగాళాఖాతంలో జూన్ 11వ తేదీన అల్పపీడనం ఏర్పడనుందని, దీని కారణంగా…జూన్ 15న ఒడిశా, ఝార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్ వైపు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పది రోజుల్లో నైరుతి రుతుపవనాలు కదలనున్నాయని అధికారులు తెలిపారు.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM