ఈటల రాజేందర్‌పై మండిపడ్డా టీఎంయూ నేతలు

byసూర్య | Sat, Jun 05, 2021, 05:00 PM

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఆర్టీసీ టీఎంయూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ యూనియన్లు, ఎమ్మెల్సీ కవిత మీద ఇష్టారీతిన మాట్లాడితే సహించేది లేదని ఘాటుగా స్పందించారు. మీడియా సమావేశంలో టీఎంయూ నేత థామస్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగుల కోసం ఈటల రాజేందర్‌ చేసింది ఏమీ లేదు. తెలంగాణ కోసం ఎమ్మెల్సీ కవిత ఎన్నో పోరాటాలు చేశారు. ఎమ్మెల్సీ కవిత గౌరవ అధ్యక్షురాలిగా ఉంటే తప్పేంటి..? ఉద్యోగ సంఘాల గౌరవ అధ్యక్షులుగా ఎవరైనా ఉండొచ్చు. బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం గురించి ఈటల మాట్లాడటం విడ్డూరం.కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌ పరం చేస్తున్నాడు. అలాంటి పార్టీలో ఈటల ఎట్లా చేరుతడు? ఆర్టీసీని ఆదుకుంటున్నది సీఎం కేసీఆరే. బడ్జెట్‌లో ఆర్టీసీకి రూ.3వేల కోట్లు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్‌ది. ఈటల రాజేందర్‌కు పదవులు, ఆస్తుల మీదనే ధ్యాస. బలహీన వర్గాల సంక్షేమం కంటే ఆయనకు పదవులే ముఖ్యం. అని మండిపడ్డారు.


Latest News
 

రైస్ మిల్లును తనిఖీ చేసిన తహసీల్దార్ Thu, Mar 28, 2024, 03:53 PM
ఉపాధి పనులపై నిర్లక్ష్యం వద్దు: ఎంపీడీఓ Thu, Mar 28, 2024, 03:51 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్ Thu, Mar 28, 2024, 03:49 PM
వెబ్ క్యాస్టింగ్ ద్వారా పోలింగ్ ను కలెక్టర్ పరిశీలన Thu, Mar 28, 2024, 03:46 PM
ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి Thu, Mar 28, 2024, 03:44 PM