ఈటల తన నిర్ణయంతో స్థాయిని దిగజార్చుకున్నారు : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

byసూర్య | Sat, Jun 05, 2021, 04:15 PM

తెలంగాణ రాజకీయాలు మాజీమంత్రి ఈటల రాజేందర్ చుట్టూ తిరుగుతున్నాయి. అన్ని పార్టీల శిబిరాల్లో ఆయన గురించే చర్చించుకునే పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యే పదవికి, టీఆర్‌ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత సీఎం కేసీఆర్ టార్గెట్‌గా ఈటల విమర్శలు సంధించారు. కేసీఆర్‌తో పాటు సీపీఐపై ఈటల విమర్శలు చేశారు. అయితే ఈటల వ్యాఖ్యలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి ఖండించారు. సీపీఐపై ఈటల వ్యాఖ్యలు నిరాధారమైనవని కొట్టిపారేశారు. టీఆర్ఎస్‌తో తమకు లోపాయికారీ ఒప్పందం ఉంటే ఈటల ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. లౌకికవాదినని చెప్పకుంటున్న.. ఈటల మతతత్వ బీజేపీలో ఎందుకు చేరుతున్నట్లు? అని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ తన నిర్ణయంతో స్థాయిని దిగజార్చుకున్నారని చాడా తప్పుబట్టారు. తెలంగాణలో బీజేపీ బలపడితే ప్రజాస్వామ్యానికే ప్రమాదమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అస్తెన్డ్ దేవాలయ భూములు ఎవరు కొన్నా తప్పేనని, తక్షణమే ప్రభుత్వానికి అప్పగించాలని సూచించారు. ప్రభుత్వం అస్తెన్డ్ భూములను పరిరక్షించాలని, లేకపోతే మళ్లీ భూ పోరాటాలు చేయాల్సి వస్తుందని చాడా వెంటకరెడ్డి హెచ్చరించారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM