ప్రభుత్వ దవాఖానాల విషయంలో సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం

byసూర్య | Sat, Jun 05, 2021, 03:17 PM

తెలంగాణ రాష్ట్రంలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాలలోని, ప్రధాన ప్రభుత్వ దవాఖానాల్లో.. 19 వైద్య పరీక్ష కేంద్రాలను "డయాగ్నోసిస్ సెంటర్లను" సోమవారం రోజున ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. మహబూబ్ నగర్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, జనగాం, ములుగు, మహబూబాబాద్, బధ్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సిద్దిపేట, నల్గొండ, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్, నిర్మల్, కరీం నగర్, అదిలాబాద్, గద్వాల, అసిఫాబాద్.. జిల్లాల్లోని ప్రధాన వైద్య కేంద్రాలలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసుకున్న డయాగ్నోసిస్ కేంద్రాలను ప్రారంభించాలని, ఈమేరకు శనివారం వైద్య అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు.


శనివారం వైద్యారోగ్యశాఖ అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి , రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవల గురించి, పలు అంశాల మీద అధికారులతో సిఎం కెసిఆర్ చర్చించారు. గతంలో సిఎం కెసిఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 19 జిల్లా కేంద్రాల్లో వైద్య పరీక్షా కేంద్రాలు ప్రారంభానికి సిద్ధంగా వున్నాయనే విషయాన్ని, వైద్యాధికారులు తన దృష్టికి తెచ్చిన నేపథ్యంలో, వాటిని సోమవారం నుంచి ప్రారంభించాలని సిఎం కేసీఆర్ వైద్యాధికారులను ఆదేశించారు. తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్యం అందిచేందుకు, అన్నిరకాల వైద్యసేవలను మరింతగా అందుబాటులోకి తేవడమే ప్రభుత్వ లక్ష్యం అని సిఎం ఈ సందర్భంగా మాట్లాడారు. 


Latest News
 

పూజలు నిర్వహించిన ఎంపీ అభ్యర్థి రఘువీర్ Wed, Apr 24, 2024, 11:42 AM
ఫోన్ ట్యాపింగ్ అంశంపై తొలిసారి స్పందించిన కేసీఆర్ Wed, Apr 24, 2024, 11:40 AM
చిన్నంగుల గడ్డ తండాలో జడ్చర్ల ఎమ్మెల్యే పూజలు Wed, Apr 24, 2024, 11:39 AM
వీరభద్రుడి సన్నిధిలో చండీ హోమం Wed, Apr 24, 2024, 10:58 AM
ఆదిలాబాద్ కు తరలిన బీజేపీ నాయకులు Wed, Apr 24, 2024, 10:57 AM