బిజెపి సర్కారు పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి హరీష్ రావు

byసూర్య | Sat, Jun 05, 2021, 12:50 PM

వ్యాక్సినేషన్ విషయంలో బిజెపి ప్రభుత్వం అనాలోచిత, అసందర్భ, తప్పుడు నిర్ణయాలతో దేశ, తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. శనివారం పట్టణంలోని బాలాజీ గార్డెన్‌లో 11రకాల స్పైడర్లకు వ్యాక్సిన్ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాక్సినేషన్‌ల విషయంలో అమ్మ పెట్టదు, అడుక్కొనివ్వదు అన్న రీతిలో కేంద్రం వ్యవహారం ఉందని మండిపడ్డారు. రాష్ట్రాలకు అవసరమైన వాక్సిన్లను కేంద్రం ఉచితంగా సరఫరా చేయడం లేదన్నారు. కంపెనీలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొనివ్వడం లేదని తెలిపారు.తెలంగాణలో ఉత్పత్తి అయిన వ్యాక్సిన్ను కూడా కంపెనీల నుంచి మనం కొనుక్కునే పరిస్థితి లేకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని మంత్రి విమర్శించారు. కేంద్రం తప్పుల మీద తప్పులు చేస్తూ రాష్ట్రాలను బద్నాం చేస్తుందని మండిపడ్డారు.


వ్యాక్సినేషన్ సకాలంలో పంపిణీలో కేంద్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిందని అన్నారు. వ్యాక్సిన్ పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలపై పునసమీక్షించుకోవాలని హితవుపలికారు. వ్యాక్సినేషన్ దిగుమతిని సరళతరం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలే ప్రాధాన్యత క్రమాలను నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించాలని మంత్రి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్‌ను కంపెనీలు, ఇతర దేశాల నుండి దిగుమతి చేసే చేసుకునే అవకాశం ఇవ్వాలన్నారు. కోవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాల కొనుగోలుకు ఇప్పటికే ఆయా కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం రూ.100 కోట్లు అడ్వాన్స్‌గా ఇచ్చిందని తెలిపారు. మూడో వేవ్ తాము కూడా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సర్వ సన్నద్ధంగా ఉందని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు.


Latest News
 

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారు Wed, Apr 24, 2024, 03:15 PM
యాదాద్రిలో ఎంపీ అభ్యర్థి చామల ప్రత్యేక పూజలు Wed, Apr 24, 2024, 02:38 PM
రామంతపూర్ డివిజన్ లో ఖాళీ అవుతున్న బిఆర్ఎస్ Wed, Apr 24, 2024, 02:31 PM
ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా Wed, Apr 24, 2024, 01:52 PM
సెకండియర్ ఫలితాల్లో నాగర్ కర్నూల్ 34 వ స్థానం Wed, Apr 24, 2024, 01:49 PM