షర్మిల తెలంగాణ పార్టీ అధికార ప్రతినిధులు వీళ్లే.?

byసూర్య | Sat, Jun 05, 2021, 10:40 AM

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టి సరికొత్త రాజకీయానికి తెరతీస్తోన్న వైఎస్ షర్మిల దూకుడుగా ముందుకెళ్తున్నారు. అడపాతడపా అధికారపార్టీపై విమర్శలు గుప్పిస్తోన్న షర్మిల.. ఇటీవల క్ష్రేత్తస్థాయి పర్యటనలకు కూడా శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. తాజాగా తను తెలంగాణలో స్థాపించబోయే పార్టీకి తొమ్మిది మంది అధికార ప్రతినిధులను నియమించారు షర్మిల. వీరిలో ఇందిరా శోభన్, సయ్యద్ ముజ్జాద్ అహ్మద్, పిట్ట రాంరెడ్డి, కొండా రాఘవరెడ్డి, ఏపూరి సోమన్న, తేడి దేవేందర్ రెడ్డి, బీశ్వ రవీందర్, మతిన్ ముజాదద్ది, భూమిరెడ్డి ఉన్నారు. వీరిని పార్టీ అధికార ప్రతినిధులుగా పేర్కొంటూ షర్మిల కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు, షర్మిల పార్టీని జులై 8న వైఎస్ఆర్ జయంతి రోజున ప్రకటించబోతోన్న సంగతి విదితమే.


అయితే షర్మిల పెట్టబోయే పార్టీ పేరు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ  "వైఎస్ఆర్టీపీ"గా ఖరారైంది. ఇటీవల షర్మిల ప్రధాన అనుచరుడు వాడుక రాజగోపాల్ కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర ఈ పార్టీ పేరును రిజిస్టర్ చేయించారు. కాగా, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని సీఎం కేసీఆర్ ఇలాకాలో అడుగుపెట్టిన షర్మిల.. తూప్రాన్ మండలం నాగుల పల్లి వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి.. . తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసే అంశంపై రైతుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్రం వచ్చి 7 ఏళ్లు గడిచినా ఉద్యమ లక్ష్యాలు దరిదాపుల్లో లేవని వైయస్ షర్మిల కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని పర్యటనలు చేయడం ద్వారా తెలంగాణ ప్రజలతో మమేకమై పార్టీని ముందుకు తీసుకెళ్లాలని షర్మిల ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్టు సమాచారం.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM