తెలంగాణ లో ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభం

byసూర్య | Sat, Jun 05, 2021, 09:33 AM

హైదరాబాద్‌లో  రేషన్‌కార్డుదారులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రేషన్ షాపుల్లో బియ్యం ఇస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా పంపిణీ చేస్తున్నారు. గత నెల, ఈ నెల కోటా కింద ప్రతి లబ్ధిదారునికి 15 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నారు. ఉచిత బియ్యం పంపిణీ ఈనెల 20 వరకు కొనసాగనుంది. ఎలాంటి పరిమితులు లేకుండా కార్డుపై ఎందరుంటే అందరికి 15 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నారు. సాధారణంగా ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున పంపిణీ చేస్తుండగా.. ఈనెలలో 15 కిలోలు ఇస్తున్నారు. ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన  "పీఎంజీకేఏవై" కింద మే, జూన్‌ నెలల్లో ఒక్కొక్కరికి 5 కిలోలు ఉచిత బియ్యం పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసింది. గత నెల, ఈ నెల కోటా కలిపి 10 కిలోలు, రాష్ట్ర ప్రభుత్వం పక్షాన 5 కిలోల చొప్పున మొత్తం 15 కిలోలు పంపిణీ చేస్తున్నారు. అంత్యోదయ, అన్నపూర్ణ కార్డుదారులకు గతంలో ఇచ్చే కోటాకు అదనంగా మరో 10 కిలోల బియ్యం ఉచితం అందజేస్తారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM