భవన నిర్మాణా కార్మికుల్లో కరోనా కలవరం

byసూర్య | Fri, Jun 04, 2021, 12:32 PM

గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో భారీ నిర్మాణ ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రతి పరిశ్రమ నష్టాలబాటలో పయనిస్తోంది. దినసరి కూలీలు కూడా చాలా నష్టపోతున్నారు. భవన నిర్మాణ రంగంలోకూడా చాలా నష్టం వాటిల్లినట్లు గణాంకాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లో నిర్మాణ రంగంలో కార్మికులు కరోనా బారిన పడ్డారు. కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ నేపథ్యంలో కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించారు. ఎప్పటిలాగే నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అయితే క్యాంప్‌లోని పలువురు కార్మికులకు కరోనా సోకినట్లు సమాచారం. వారిని క్యాంప్‌నకు దూరంగా ఉంచి చికిత్స అందించగా.. ఇద్దరు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందినట్లు తెలియవచ్చింది. దీంతో మిగతా కార్మికులు ఆందోళనకు గురై పనులు చేయలేమని చెబుతున్నారు. కరోనా భయంతో తమ బిల్లులు చెల్లిస్తే.. ఇళ్లకు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకుని మళ్లీ వస్తామని కార్మికులు అంటున్నారు. కార్మికులు తరలిపోతే గడువులోగా ప్రాజెక్టు పూర్తికాదని, దాంతో తమకు అదనపు భారం పడుతుందని బిల్డర్లు ఆందోళన చెందుతున్నారు. దీనికి పరిష్కారంగా కార్మికులకు కరోనా వ్యాక్సిన్ వేయించడానికి బిల్డర్లు ఆసక్తి చూపుతున్నారు. కానీ వేరా రాష్ట్రాల కార్మికులకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు లేవు.


Latest News
 

యాదాద్రి శ్రీవారిని దర్శించుకున్న ఐజిపి Fri, Mar 29, 2024, 10:32 AM
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి...! Fri, Mar 29, 2024, 10:26 AM
కేసీఆర్ ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండాలి: విజయశాంతి Fri, Mar 29, 2024, 10:19 AM
జైలు అధికారులు వసతులు కల్పించడం లేదు: ఎమ్మెల్సీ కవిత Fri, Mar 29, 2024, 09:55 AM
కొత్త తరం నాయకత్వం తయారు చేస్తాం: కేటీఆర్ Fri, Mar 29, 2024, 09:42 AM