వీడియోలు తీసి బ్లాక్‌ మెయిల్‌
 

by Suryaa Desk |

ఆన్‌ లైన్‌ లో డేటింగ్‌ యాప్‌ పేరిట ఓ యువకుడిని వీడియోలు తీసి బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్న వ్యక్తులపై పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ రమేష్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. లోకాంటో ఆన్‌లైన్‌ డేటింగ్‌ యాప్‌ పేరుతో నిందితులు యువకులను మభ్యపెడుతున్నారు. అమ్మాయిలు, అబ్బాయిల మధ్య కమ్యూనికేషన్‌ ఉండేలా చూస్తామని నమ్మించి మోసానికి పాల్పడుతున్నారు. సుచిత్ర గోదావరి హోమ్స్‌ కి చెందిన కరుణాకర్‌ అనే యువకుడు ఆన్ ‌లైన్‌ లో ఉన్న డేటింగ్‌ యాప్‌ ను సంప్రదించాడు. ఈ క్రమంలో ఓ యువతితో అతడికి పరిచయం ఏర్పడింది. చేస్తూ వారిద్దరూ చాటింగ్ చేయడం మొదలెట్టారు. వారం రోజుల వ్యవధిలో ఆ యువకుడి నగ్న ఫొటోలను ఆ యువతి సేకరించింది. ఆ తర్వాత మరో వ్యక్తి ఆ యువకుడిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలెట్టాడు. నీ ఫొటోలను సోషల్‌ మీడియాలో అప్‌ లోడ్‌ చేస్తామని బెదిరించి.. డబ్బులు ఇవ్వాలని అడిగాడు. దీంతో బాధిత యువకుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. వెంటనే సీఐ రమేష్‌ కేసు నమోదు చేసుకుని సైబర్‌ క్రైమ్ ‌కు సమాచారం ఇచ్చారు.


Latest News
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM
రైల్వే ఉద్యోగి దారుణ హత్య.. Sat, May 08, 2021, 12:44 PM