సాగర్‌ అభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యం: మంత్రి తలసాని
 

by Suryaa Desk |

నల్లగొండ: నాగార్జునసాగర్‌ ఉపఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్‌ పార్టీ దూసుకుపోతున్నది. పార్టీ అభ్యర్థి నోముల భగత్‌ విజయంకోసం మంత్రులు, ఎమ్మెల్యేలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌ అనుమల మండలం పాలెం, చింతగూడెం, రామడుగులో ప్రచారం చేశారు. ఈసందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. అన్నివర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని చెప్పారు. సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశానని చెప్పుకోవడం తప్ప జానారెడ్డి సాగర్‌ నియోజకవర్గానికి చేసిందేమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు.


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులకు పెట్టుబడికోసం ఎకరానికి రూ.10 వేలు ఆర్థికసాయం, 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని చెప్పారు. పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తున్నామని తెలిపారు. సాగర్‌ నియోజకవర్గ అభివృద్ధి ఒక్క టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమవుతుందన్నారు. ఈనెల 17న టీఆర్‌ఎస్‌ అభ్యర్థి భగత్‌కు ఓటేసి అభివృద్ధికి పట్టంకట్టాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.


సీఎం కేసీఆర్‌ పాలనలో గ్రామాలు అభివృద్ధి చెందాయని మంత్రి శీనివాస్‌గౌడ్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి భగత్‌ను గెలిపిస్తే సాగర్‌ మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. సాగర్‌ ఉపఎన్నికలో భగత్‌ గెలుపు కాయమని స్పష్టం చేశారు.


Latest News
తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు Sat, May 08, 2021, 04:07 PM
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM