జ‌ర్న‌లిస్టుల డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌కు కేటీఆర్ శంకుస్థాప‌న‌
 

by Suryaa Desk |

 వ‌రంగ‌ల్‌ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో డ‌బుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాల‌కు ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న చేశారు. దూపకుంటలో రూ. 31.80 కోట్లతో నిర్మిస్తున్న 600 డబుల్ బెడ్రూం ఇండ్లు, దేశాయిపేటలో రూ. 10.60 కోట్లతో జర్నలిస్టుల కోసం కడుతున్న 200 డబుల్ బెడ్రూం ఇండ్ల పనులకు కేటీఆర్ శంకుస్థాప‌న చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మీడియా అకాడ‌మీ చైర్మ‌న్ అల్లం నారాయ‌ణ‌తో పాటు జ‌ర్న‌లిస్టులు పాల్గొన్నారు.ఇవాళ ఉద‌యం రాంపూర్ గ్రామంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లో ఏర్పాటు చేసిన మిష‌న్ భ‌గీర‌థ వాట‌ర్ ట్యాంక్‌ను కేటీఆర్ ప్రారంభం చేశారు. ఈ ట్యాంక్ సామ‌ర్థ్యం 8 ల‌క్ష‌ల లీట‌ర్లు. వాట‌ర్ ట్యాంకు అందుబాటులోకి రావ‌డంతో స్థానిక ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. వాట‌ర్ ట్యాంకు ప్రారంభం కంటే ముందు అక్క‌డ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిష‌న్‌ను మంత్రి కేటీఆర్ వీక్షించారు. వరంగల్‌ పర్యటనలో భాగంగా మొత్తం రూ.1,700 కోట్లతో చేపట్టిన పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. కేటీఆర్ వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్‌, చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్‌, నన్నపునేని నరేందర్‌, చల్లా ధర్మారెడ్డి, టీ రాజయ్య ఉన్నారు.


Latest News
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM
రైల్వే ఉద్యోగి దారుణ హత్య.. Sat, May 08, 2021, 12:44 PM
మాస్కులు వాడేట‌ప్పుడు ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి Sat, May 08, 2021, 12:06 PM