ప్రతీ నియోజకవర్గంలో ఉచిత కోచింగ్ సెంటర్
 

by Suryaa Desk |

తెలంగాణ నిరుద్యోగుల కోసం తీపి కబురు లాంటి పనికి సర్కార్ శ్రీకారం చుట్టబోతోంది. త్వరలోనే రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి ఒక బీసీ స్టడి సర్కిల్ ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. వీటిని 2021 జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటికి ప్రారంభించేలా కసరత్తు మొదలైందని తెలిపారు. ఈ బీసీ స్టడీ సెంటర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే అన్ని నోటిఫికేషన్లకు ఉచిత శిక్షణ కల్పిస్తామని అలాగే ఇందులో చేరే వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. మహాత్మా జ్యోతిపూలే జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన మంత్రి ఈ మేరకు స్పష్టం చేశారు.


Latest News
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM
రైల్వే ఉద్యోగి దారుణ హత్య.. Sat, May 08, 2021, 12:44 PM
మాస్కులు వాడేట‌ప్పుడు ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి Sat, May 08, 2021, 12:06 PM