జూబ్లీహిల్స్‌లో దారుణ హత్య
 

by Suryaa Desk |

గత రాత్రి 2 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్‌లో శివ అనే 40 ఏళ్ల వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఇతడు కూలి పని చేసుకుంటూ ఫూట్ పాత్‌పై జీవిస్తున్నాడు. గత రాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10బీ ఫూట్ పాత్ పై తోటి కూలీలు మరో ముగ్గురు (డేవిడ్, శ్రీనివాస్, రాకేష్)తో కలిసి మద్యం సేవించారు. మధ్యరాత్రి తరువాత రాకేష్, శ్రీనివాస్ వెళ్లిపోగా మృతుడు శివ, డేవిడ్ అక్కడే ఉన్నారు. తెల్లవారు జామున 2.20 గంటల ప్రాంతంలో శ్రీనివాస్(ముగ్గురిలో ఒకడు) వచ్చి చూడగా మృతుడు మద్యం సేవించిన ప్రదేశంలోనే తల పగిలి రక్తపు మడుగులో చనిపోయి పడి ఉన్నాడు. వెంటనే శ్రీనివాస్ డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించగా.. జూబ్లీహిల్స్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. అనుమానితుడు డేవిడ్ కోసం మూడు బృందాలతో గాలింపు చేపట్టారు.


Latest News
హైదరాబాద్ లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం.. నేలకూలిన చెట్లు, విద్యుత్ స్థంభాలు Sun, May 16, 2021, 05:39 PM
ఈటల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా సానుభూతి.! Sun, May 16, 2021, 04:52 PM
లాక్‌డౌన్ నిబంధనలతో అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో రాకపోకలు నిలిపివేత Sun, May 16, 2021, 04:02 PM
వీణవంకలో ఈటల, టీఆర్‌ఎస్ వర్గీయులకు మధ్య ఘర్షణ Sun, May 16, 2021, 03:42 PM
వరుసగా ఆరు చైన్ స్నాచింగ్‎లు..బయాందోళనలో స్త్రీలు Sun, May 16, 2021, 03:28 PM