తెలంగాణలో అక్కడ మద్యం బంద్...!
 

by Suryaa Desk |

తెలంగాణలోని జనగామ జిల్లా వడ్లకొండ గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తున్నట్లు గ్రామస్తుల సమక్షంలో ఆదివారం తీర్మానం చేశారు. ఈ విషయాన్ని సర్పంచ్‌ బొల్లం శారద తెలిపారు. గ్రామంలో ఉన్న బెల్టు షాపుల్లో ఈ నెల 13 నుంచి పూర్తిగా మద్యం అమ్మకాలు బంద్ చేయాలని, ఎవరైనా మద్యం అమ్మకాలు జరిపితే రూ. 25వేల జరిమానా విధిస్తామని చెప్పారు. అమ్మకాలు జరిపినట్లు గ్రామస్తులు తెలిపితే వారికి రూ. 10వేల బహుమతి అందజేస్తామని తీర్మానం చేసినట్లు తెలిపారు. మద్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, గొడవలు జరిగి పోలీస్‌ స్టేషన్‌ వరకు వెళ్తున్నారని గుర్తించి పూర్తిగా మద్యపానాన్ని నిషేధించామని తెలిపారు.


Latest News
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM
రైల్వే ఉద్యోగి దారుణ హత్య.. Sat, May 08, 2021, 12:44 PM
మాస్కులు వాడేట‌ప్పుడు ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి Sat, May 08, 2021, 12:06 PM