తెలంగాణలో కొత్తగా 3,187 కరోనా కేసులు
 

by Suryaa Desk |

రాష్ట్రంలో కరోనా పంజా విసురుతోంది. రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3,187 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ ఆదివారం హెల్త్‌ బులిటెన్‌లో తెలిపింది. వైరస్‌ ప్రభావంతో మరో ఏడుగురు మృత్యువాతపడ్డారు. తాజాగా మరో 787 మంది కోలుకొని ఇండ్లకు వెళ్లారు. రాష్ట్రంలో 20,184 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 13,336 మంది బాధితులున్నారు. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3.27 లక్షలకు చేరగా.. ఇప్పటి వరకు 3.05లక్షల మంది కోలుకున్నారు. వైరస్‌ బారిన పడి మొత్తం 1,759 ప్రాణాలు విడిచారు. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 551, మేడ్చల్‌లో 333, రంగారెడ్డిలో 271 నమోదయ్యాయి.


Latest News
మావోయిస్టు పార్టీ కీలక నేత కన్నుమూత Sun, Jun 13, 2021, 03:29 PM
ఎంత చేసినా.. రాష్ట్రంలో టీడీపీ ముందుకు వెళ్లడం లేదు : ఎల్ రమణ Sun, Jun 13, 2021, 02:47 PM
సమాచారం లేకుండా వ్యాక్సిన్ సెంటర్లను మార్చిన జీహెచ్ఎంసీ Sun, Jun 13, 2021, 02:18 PM
చంచల్‌గూడ జైలును తరలించండి.. కేసీఆర్‌కు అసద్ వినతి Sun, Jun 13, 2021, 01:50 PM
హుజురాబాద్ ఉపఎన్నికపై కేసీఆర్ ఫోకస్ Sun, Jun 13, 2021, 01:16 PM