తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశానికే ఆదర్శం : ఎమ్మెల్యే కేపి వివేకానంద్
 

by Suryaa Desk |

రూ.3.13 కోట్లతో నిర్మిస్తున్న బాచుపల్లి పోలీస్ స్టేషన్ కు శంఖుస్థాపన చేసిన సీపి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఊరగుట్టపై ఉన్న 2 ఎకరాల స్థలంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటి ( సీఎస్ఆర్ ) నిధుల కింద అరబిందో ఫార్మా స్యూటికల్స్ సంస్థ సహకారంతో రూ.3.13 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న బాచుపల్లి పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి ఈరోజు సైబరాబాద్ పోలీసు కమిషనర్ విసి సజ్జనార్ , ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , ఎమ్మెల్యే కేపి వివేకానంద్ , అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానంద రెడ్డి గారు, స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా పాల్గొని శంఖుస్థాపన చేశారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి పురాతన భవనంలో కొనసాగుతున్న పోలిస్ స్టేషన్ కు కొత్త భవణం నిర్మాణానికి శంఖుస్థాపన చేయడం సంతోషకరం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుండి పోలీస్ శాఖకు అధునాతన వాహనాలు ఇవ్వడం జరిగిందన్నారు. తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశానికి ఒక ఆదర్శంగా నిలిచిందని, ఫ్రెండ్లీ పోలీసింగ్ సక్సెస్ అయ్యిందన్నారు. ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ పై ఎన్నో రాష్ట్రాల డీజీపీలు, ముఖ్యమంత్రులు తెలంగాణ పోలీసులను, సేవలను ప్రశంసించారని అన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతికత వినియోగిస్తూ పోలీసులు ముందుకు వెళుతున్నారని. ఎన్నో క్లిష్టమైన కేసులు చేదిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని అన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా భవిష్యత్తులో అన్ని సౌకర్యాలతో కూడిన బాచుపల్లి పోలీస్ స్టేషన్ నిర్మాణానికి అరబిందో ఫార్మా స్యూటికల్స్ సంస్థ సహకారం అందించడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు, నిజాంపేట్ కమిషనర్ గోపి, ఐఎఎస్, డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్, స్థానిక ఇన్స్పెక్టర్ నర్సింహారెడ్డి మరియు కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు Sat, May 08, 2021, 04:07 PM
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM