విషాదంగా ముగిసిన మిస్సింగ్ కేసు...!
 

by Suryaa Desk |

మేడ్చల్ జిల్లా శామీర్‌పేట పెద్ద చెరువులో శుక్రవారం ఓ వివాహిత మృతదేహం లభ్యమైంది. పోలీసులు, బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. శామీర్‌పేట పెద్ద చెరువులోని ఓ బండ రాయిపై సెల్ ఫోన్‌ను స్థానికులు గుర్తించి, శామీర్‌పేట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సెల్ ఫోన్ ఆధారంగా విచారణ జరుపగా జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని యాప్రాలకు చెందిన కమ్మరి నాగమణిది(40) గా గుర్తించారు. నాగమణి కనిపించడం లేదని గురువారం జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయినట్లు తెలసుకున్న పోలీసులు శామీర్‌పేట చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు నాగమణి మృతదేహం చెరువులో లభించడంతో కుటుంబీకులకు సమాచారం అందించగా మృతదేహం నాగమణిదేనని నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.Latest News
తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు Sat, May 08, 2021, 04:07 PM
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM