తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్
 

by Suryaa Desk |

తెలంగాణలోని వ్యవసాయ, పశుసంవర్థక యూనివర్సిటీల పరిధిలో చేపట్టే నియామకాలకు ఆర్థికంగా వెనుకబడిన రిజర్వేషన్లు (ఈడబ్ల్యూఎస్‌) అమలవుతాయని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలు నేపథ్యంలో మార్చి 31న జారీ చేసిన నోటిఫికేషన్‌కు తాజాగా టీఎస్‌పీఎస్‌సీ అనుబంధ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. రెండు విశ్వవిద్యాలయాల్లో కలిపి 127 సీనియర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్‌లోని పోస్టులకు 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటాను వర్తింపజేస్తూ రోస్టర్ పాయింట్లను సైతం ఖరారు చేసింది. ఈ పోస్టులకు ఈనెల 19 నుంచి మే 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్‌పీఎస్‌సీ తెలిపింది. నిరుద్యోగులు ఈ విషయాలను గమనించి దరఖాస్తు చేసుకోవాలిన సూచించింది.


Latest News
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM
రైల్వే ఉద్యోగి దారుణ హత్య.. Sat, May 08, 2021, 12:44 PM
మాస్కులు వాడేట‌ప్పుడు ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి Sat, May 08, 2021, 12:06 PM