తెలంగాణలో కొత్తగా 2,909 పాజిటివ్‌ కేసులు
 

by Suryaa Desk |

తెలంగాణలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వైద్యారోగ్య శాఖ తాజా బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 2,909 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ తో నిన్న ఆరుగురు మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,24,091కి చేరగా మృతుల సంఖ్య 1752కు చేరుకుంది. ప్రస్తుతం 17,791 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 11,495 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. రాష్ట్రంలో వైరస్ బారిన పడ్డవారిలో ఇప్పటి వరకు 3,04,548 మంది కోలుకున్నారు. సెకండ్ వేవ్ వ్యాప్తి తీవ్ర రూపంలో ఉండటంతో ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.


Latest News
తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు Sat, May 08, 2021, 04:07 PM
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM