పండుగ సమయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి: సీపీ అంజనీ కుమార్
 

by Suryaa Desk |

రానున్న పండగల సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని, కరోనా బారిన పడకుండా ఉండాలని నగర కమిషనర్ అంజనీ కుమార్ సూచించారు. నిత్యం కేసులు పెరిగిపోతుంటే, ప్రజలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోక తప్పేలా లేదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. సుమారు కోటి మందికి పైగా జనాభా ఉన్న జీహెచ్ఎంసీ పరిధిలో పెరుగుతున్న కేసులను ఎవరూ లెక్క చేయడం లేదని అభిప్రాయపడ్డారు. కరోనా మహమ్మారి వ్యక్తిపై నిరంతరం అప్రమత్తత అవసరమని, మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి నిబంధనలను ఎంత మాత్రం పాటించడం లేదని, స్వీయ రక్షణ, తమ కుటుంబీకుల రక్షణ గురించి ప్రజలు మరిచారని అన్నారు. మాస్క్‌లు లేకుండా వీధుల్లో తిరిగితే కేసులు నమోదు చేయక తప్పదని హెచ్చరించారు.


Latest News
తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు Sat, May 08, 2021, 04:07 PM
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM