తెలంగాణలో కరోనా టెన్షన్.. ఆ గ్రామాల్లో లాక్ డౌన్...!
 

by Suryaa Desk |

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో గ్రామాలు స్వచ్చంధంగా లాక్ డౌన్ విధించుకుంటున్నాయి. తెలంగాణలోని మహారాష్ట్ర సరిహద్దు, నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బోధన్ నియోజకవర్గంలో 3 మండలాల్లో లాక్ డౌన్ విధించారు. బోధన్ మండలం సాలూర క్యాంపు, రెంజల్ మండలం తాడి బిలోలి, నవీపేట్ మండలం బినోల గ్రామాల్లో 15 రోజుల పాటు స్వచ్ఛందంగా లాక్ డౌన్ విధించారు. ఆయా గ్రామాల్లో సుమారు 30 మందికి పైగా కరోనా బారిన పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వ్యాపార సంస్థలు మూసివేశారు. తమ గ్రామంలోకి ఎవరూ రావద్దని సూచిస్తున్నారు.


Latest News
తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు Sat, May 08, 2021, 04:07 PM
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM