ప్రేమ పేరుతో మోసం
 

by Suryaa Desk |

ప్రేమించి పెండ్లి చేసుకుంటానని నమ్మించి, తీరా ఆ యువతి గర్భం దాల్చడంతో కులాల పేరు చెప్పి ఆ యువకుడు పెండ్లికి నిరాకరించిన ఘటన కొమురవెల్లి మండలంలో చోటు చేసుకుంది. ఆరు నెలల గర్భవతి అయిన బాధితురాలు తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తల్లిదండ్రులతో కలిసి యువకుడి ఇంటి ముందు గురువారం ధర్నాకు దిగింది. వివరాల్లోకి వెళ్తే.. కొమురవెల్లి మండలం అయినాపూర్ లో ఎస్సీ కులానికి చెందిన యువతిని, అదే గ్రామానికి చెందిన ముదిరాజ్ కులానికి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడు. పెండ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పాడు. తీరా అమ్మాయి గర్భం దాల్చిన తర్వాత పెండ్లికి నిరాకరించాడు. అయితే ఇద్దరు కులాలు వేరుకావడంతో యువకుని తల్లిదండ్రులు పెండ్లికి ఒప్పుకోలేదు. దాంతో యువకునిపై పది రోజుల కిందట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపారు. కాగా, తమ కూతురికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళనకు దిగినట్టు యువతి తండ్రి బక్కి రాందాస్ తెలిపారు.


Latest News
హైదరాబాద్ లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం.. నేలకూలిన చెట్లు, విద్యుత్ స్థంభాలు Sun, May 16, 2021, 05:39 PM
ఈటల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా సానుభూతి.! Sun, May 16, 2021, 04:52 PM
లాక్‌డౌన్ నిబంధనలతో అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో రాకపోకలు నిలిపివేత Sun, May 16, 2021, 04:02 PM
వీణవంకలో ఈటల, టీఆర్‌ఎస్ వర్గీయులకు మధ్య ఘర్షణ Sun, May 16, 2021, 03:42 PM
వరుసగా ఆరు చైన్ స్నాచింగ్‎లు..బయాందోళనలో స్త్రీలు Sun, May 16, 2021, 03:28 PM