టీఆర్ఎస్ నూతన కార్యాలయాన్ని పరిశీలించిన ఎర్రబెల్లి
 

by Suryaa Desk |

జనగామ: నిర్మాణంలో వున్న జనగామ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పలు సూచనలు చేశారు.మరి కొద్ది రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. త్వరలో సీఎం కేసీఆర్, మంత్రి కెటీఆర్ ల చేతుల మీదుగా ప్రారంభింప చేస్తామని ప్రకటించారు. కరోనా కారణంగా నిర్మాణం ఆలస్యమైంది అతి త్వరలో కార్యాలయాన్ని పూర్తి చేసి కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులోకి తెస్తాంమని ఆయన చెప్పారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకొని కరోనా మహమ్మారిని అరికట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చెప్పారు.


Latest News
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM
రైల్వే ఉద్యోగి దారుణ హత్య.. Sat, May 08, 2021, 12:44 PM
మాస్కులు వాడేట‌ప్పుడు ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి Sat, May 08, 2021, 12:06 PM