సూర్యాపేటలో వైఎస్ షర్మిలకు ఘన స్వాగతం
 

by Suryaa Desk |

 ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల భారీ కాన్వాయ్‌తో సూర్యాపేట చేరుకున్నారు. ఈ సందర్భంగా పిట్టరాం రెడ్డి సేన 5 వేల మందితో షర్మిలకు ఘన స్వాగతం పలికింది. అడగడుగునా అభిమానులతో అభినందనలు తెలుపుతున్నారు. కాగా.. షర్మిల తెలంగాణలో రాజకీయ సంకల్పం తీసుకోనున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని పెవిలియన్‌ గ్రౌండ్‌లో సంకల్ప సభ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. వైఎస్‌ సతీమణి, వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి కూడా కుమార్తె వెంటే ఉన్నారు. ప్రస్తుతం షర్మిల సూర్యాపేట దాటి.. నకిరేకల్ చేరుకున్నారు.


ఖమ్మం పట్టణానికి సమీపంలోని పెద్దతండా వద్ద వైఎస్‌ విగ్రహానికి నివాళులు అర్పించి.. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో వీరంతా పెవిలియన్‌ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. లక్ష మందితో సంకల్ప సభను నిర్వహించాలని షర్మిల భావించినా కొవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో కేవలం 6 వేల మందితో నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతినిచ్చారు. అయితే, అభిమానుల ఉత్సాహం చూస్తుంటే సంకల్ప సభకు భారీగానే హాజరయ్యే సూచనలు కనిపిస్తున్నాయని షర్మిల పార్టీ నేత ఒకరు తెలిపారు. సభలో షర్మిల ఏం మాట్లాడుతారా..? అని అభిమానులు, అనుచరులు, పార్టీ నేతల్లో సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Latest News
తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు Sat, May 08, 2021, 04:07 PM
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM