మరింత అప్రమత్తంగా ఉండాలి: సీఎం కేసీఆర్

byసూర్య | Fri, Apr 09, 2021, 12:55 PM

దేశవ్యాప్తంగా మరల కరోనా తిరిగి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ మాస్కులు ధరించి, తగు జాగ్రత్తలు పాటించాలని, కరోనా కట్టడికోసం ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలను కోరారు. రాష్ట్రంలో ముఖ్యంగా జనం రద్దీగా ఉండే ప్రాంతాలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ప్రజలతో పాటు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ప్రజలు కరోనా పట్ల మరింత అప్రమత్తతతో మెలగాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో కరోనా తిరిగి పునరావృతమౌతున్న నేపథ్యంలో కరోనా పరీక్షలను భారీగా పెంచాలని అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాలకు చెందిన ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కి వందశాతం వ్యాక్సినేషన్ చేయించాలన్నారు. ఈ ప్రక్రియను వారం రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. వారి వారి శాఖల్లో పనిచేసే సిబ్బంది మొత్తానికి వాక్సినేషన్ ప్రక్రియను వారం రోజుల్లో నూటికి నూరు శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. వాక్సినేషన్ పురోగతిని ప్రతీ రోజు ఆయా శాఖల ఉన్నతాధికారులు సీఎంవోకు రిపోర్ట్ చేయాలని స్పష్టం చేశారు. కరోనా నియంత్రణ కోసం కీలకమైన మాస్కులు ధరించే నిబంధనను కఠినంగా అమలు పరచాలన్నారు. ప్రజలు మాస్కు ధరించకపోతే వేయి రూపాయల జరిమానా విధించేలా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ఈ నిబంధనను అందరూ పాటించేలా పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని డీజీపీని సీఎం ఆదేశించారు. 45 సంవత్సరాల పైబడిన వారందరూ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని సీఎం ప్రజలను కోరారు.


Latest News
 

చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కలిసిన నీలం మధు ముదిరాజ్ Fri, Mar 29, 2024, 03:42 PM
బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య? Fri, Mar 29, 2024, 03:11 PM
సీఎం రేవంత్ ను కలిసిన కేకే Fri, Mar 29, 2024, 03:08 PM
నిప్పంటించుకుని యువకుని ఆత్మహత్య Fri, Mar 29, 2024, 02:56 PM
ప్రజల సౌకర్యార్థం బోరును తవ్వించినవి కాంగ్రెస్ నాయకులు Fri, Mar 29, 2024, 02:55 PM