కంటైన్‌మెంట్‌ జోన్లు కచ్చితంగా ఉండాలి : తెలంగాణ హైకోర్టు
 

by Suryaa Desk |

తెలంగాణలో కరోనా వైరస్ నియంత్రణ విషయంలో ప్రభుత్వ చర్యలపై మరోసారి హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. వైద్యారోగ్యశాఖ, DGP సమర్పించిన నివేదికలో అంశాల్ని పరిశీలించిన కోర్టు.. RTPCR పరీక్షలు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 70 శాతానికి పెంచాలని ఆదేశించింది. లాక్ డౌన్ లేక పోయినా.. కంటైన్‌మెంట్‌ జోన్లు కచ్చితంగా ఉండాలని కోర్టు సూచించింది. మద్యం దుకాణాలు, పబ్ లు, థియేటర్లలో రద్దీపై ఆందోళన వ్యక్తం చేసిన కోర్టు.. మద్యం దుకాణాలు కరోనా కేంద్రాలుగా మారాయంది.


అటు, నిబంధనల ఉల్లంఘనలపై పోలీసులు తీసుకుంటున్న చర్యలపై కోర్టు సమీక్షించింది. సామాజిక దూరం పాటించని వారిపై 2 వేల 416 కేసులు, రోడ్లపై ఉమ్మిన వారిపై 6 కేసులుతోపాటు వివిధ ఉల్లంఘనలపై 22 వేల కేసులు పెట్టినట్టు DGP కోర్టు దృష్టికి తెచ్చారు. ఐతే.. ఈ చర్యలు సరిపోవని కోర్టు అభిప్రాయపడింది. పాతబస్తీ లాంటి చోట్ల 2 రోజులు తనిఖీ చేస్తేనే లక్ష ఉల్లంఘనలు కనిపిస్తాయంది కోర్టు. వైరస్ వ్యాప్తి అరికట్టాలంటే కఠినంగా ఉండాలని సూచించింది. అలాగే.. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో వ్యాక్సినేషన్‌ ఏర్పాట్లపై కూడా ఆరా తీసింది.


Latest News
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM
రైల్వే ఉద్యోగి దారుణ హత్య.. Sat, May 08, 2021, 12:44 PM
మాస్కులు వాడేట‌ప్పుడు ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి Sat, May 08, 2021, 12:06 PM