భగ్గుమంటున్న అడవులు
 

by Suryaa Desk |

ఉష్టోగ్రతలు అత్యధికంగా నమోదు కావడంతో అడువులు పలు చోట్ల ఎరగడి పడుతున్నాయి. దుమ్ముగూడెం అటవీ రేంజి పరిధిలోని పర్ణశాల సెక్షన్‌లో గల పెద్దబండిరేవు, ములకనాపల్లి, పులిగుండాల అటవీ ప్రాంతాల్లో పలు చోట్ల చెట్ల నుండి రాలిన ఆకులకు మంటలు అంటుకుని పెద్ద మంటలతో అడవులలో మంటలు చెలరేగుతూ పొగలు కమ్ముతున్నాయి. అటవీ సిబ్బంది ఎండాకాలంలో అడవులను సంరక్షించేందుకు ఫైర్‌ లైన్స్‌ ఏర్పాటు చేసినపప్పటికి గుట్ట దట్టంగా ఉన్న అటవీ ప్రదేశంలో అడవులకు నిప్పంటుకుని మంటలు చెలరేగుతున్నాయి. ఈ విషయమై పర్ణశాల ఫారెస్టు బీట్‌ ఆఫీసరు శ్రీనును వివరణ కోరగా ఎండాకాలంలో అడవులను మంటల నుండి రక్షించేందుకు ముందస్తుగా ఫైర్‌ లైన్లు ఏర్పాటు చేశామని గుట్ట వంటి అటవీ ప్రాంతంలోనే అక్కడక్కడా అడవి ఎరగడి పడుతుందన్నారు. దీని వలన అటవీ మొక్కలకు ఎటువంటి నష్టం వాటిల్లదని ఆయన తెలిపారు.


Latest News
తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు Sat, May 08, 2021, 04:07 PM
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM