ఉప ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న ఎంపీ కోమ‌టిరెడ్డి
 

by Suryaa Desk |

కాంగ్రెస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌పై బెదిరింపుల‌కు పాల్ప‌డితే ఖ‌బ‌ర్ధార్ అని భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి హెచ్చ‌రించారు. మ‌రోసారి కాంగ్రెస్ నేత‌ల‌ను భ‌య‌పెట్టాల‌ని చూస్తే దెబ్బ‌కు దెబ్బ తీస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. మంగళవారం నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నికల ప్ర‌చారంలో భాగంగా మాడుగుల‌ప‌ల్లి మండ‌లం అభంగాపురం, గ‌జ‌లా‌పురం, పూస‌లాపాడు, నారాయ‌ణ‌పురంతో పాటు ప‌లు గ్రామాల్లో ప‌ర్య‌టించి కాంగ్రెస్ అభ్య‌ర్ధి జానారెడ్డి త‌ర‌పున ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ గ్రామాల ప్ర‌జ‌లు కోమటిరెడ్డి వెంక‌ట్ రెడ్డికి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్‌పై తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. హైద‌రాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ అభ్య‌ర్ధిగా రూ. 200 కోట్లు ఉన్న సుర‌భి వాణిని నిల‌బెట్టిన నువ్వు, మ‌లిద‌శ ఉద్యమ తొలి అమ‌రుడు శ్రీకాంతాచారి త‌ల్లి శంక‌ర‌మ్మ‌కు ఎందుకు ఇవ్వ‌లేద‌ని సూటిగా ప్ర‌శ్నించారు. శ్రీకాంతా చారి ప్రాణాలు ఇవ్వ‌డం వ‌ల్లే తెలంగాణ వ‌చ్చి కేసీఆర్ సీఎం అయ్యార‌ని, అలాంటి అమ‌రుడి కుటుంబాన్ని ప‌ట్టించుకోక‌పోవ‌డం ఎంట‌నీ ఆగ్రహం వ్య‌క్తం చేశారు. త‌ప్ప‌కుండా జానారెడ్డిని అత్య‌ధిక మెజార్టీతో గెల‌పించాల‌ని కోరారు.


Latest News
తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు Sat, May 08, 2021, 04:07 PM
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM