14న సీఎం కేసీఆర్ బహిరంగ సభ
 

by |

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణం కారణంగా నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికల ఏప్రిల్‌ 17 ను జరుగనుంది. ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్ ఉప ఎన్నికపై అన్ని పార్టీలు దృష్టి పెట్టాయి. ఈ ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పోటాపోటీ ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ప్రచారంలో దూకుడు పెంచాయి పార్టీలు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్ధులు వినూత్నంగా ప్రచారం చేసున్నారు. సాగర్‌ ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకున్న తరుణంలో... స్వయంగా సీఎం కేసీఆర్‌ కూడా రంగంలోకి దిగుతున్నారు. 14న హాలియాలో సాయంత్రం 4 గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్‌. ఈ సభ కోసం టీఆర్‌ఎస్‌ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆ సభలో సీఎం కేసీఆర్‌ ప్రస్తావించనున్నారు. కాగా.. ఈ నెల 15తో ఎన్నికల ప్రచారం ముగియనుంది.


Latest News
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM
రైల్వే ఉద్యోగి దారుణ హత్య.. Sat, May 08, 2021, 12:44 PM