వేగంగా దూసుకొచ్చి డివైడర్​ను ఢీకొట్టిన కారు...!
 

by Suryaa Desk |

వేగంగా దూసుకొచ్చిన ఓ కారు డివైడర్​ను ఢీకొట్టిన సంఘటన బోయిన్​పల్లి పోలీస్​స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న వృద్ధురాలికి గాయాలయ్యాయి. బోయిన్​పల్లి మార్కెట్ యార్డు ఎదుట ఉన్న డివైడర్ పైకి కారు ఎక్కడం వల్ల ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ అయింది. వెంటనే ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి కారును పక్కకు తప్పించి ఇతర వాహనాలకు లైన్ క్లియర్ చేశారు. దాదాపు 60 ఏళ్ల వృద్ధురాలు కారులో వేగంగా రావడం మూలంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


Latest News
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM
రైల్వే ఉద్యోగి దారుణ హత్య.. Sat, May 08, 2021, 12:44 PM
మాస్కులు వాడేట‌ప్పుడు ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి Sat, May 08, 2021, 12:06 PM