భర్తకు షాకిచ్చిన భార్య.. వేరే వ్యక్తితో పరార్...!
 

by Suryaa Desk |

రాజస్థాన్ జోధ్‌‌పూర్‌ బారీ ఖోకూండ గ్రామానికి చెందిన ప్రభుదాస్‌, తన భార్య రమ్య, రెండేళ్ల కుమారుడు ప్రకాశ్‌ లతో కలిసి ఈనెల 3న హైదరాబాద్ లో ఉంటున్న త‌మ‌ అమ్మమ్మ ఇంటికి వచ్చారు. అమ్మమ్మను పలకరించి ఇక వారి ఊరు వెళ్దామ‌ని ఈనెల 4న కుటుంబ సమేతంగా ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. రైల్వే స్టేషన్‌కు చేరుకున్న రమ్య వాటర్ బాటిల్‌ తెచ్చుకుంటానని చెప్పి రెండేళ్ల కుమారుడు ప్రకాశ్ తో‌ రైల్వే స్టేషన్‌ ఎదురుగా ఉన్న‌ రోడ్డు వైపుకు వెళ్లింది. ఈలోగా రైల్వే స్టేషన్‌ ఎదురుగా ఓ ఆజ్ణాత వ్యక్తి బైకుతో ఉండగా రమ్య తన కుమారుడితో వెళ్లి ఆ బైకుపై ఎక్కి వెళ్లిపోయింది. చాలాసేపటికి తన భార్య రాకపోవడంతో అనుమానం వచ్చి రైల్వే స్టేషన్‌ ముందు ప్రభుదాస్ వాకబు చేశాడు. ఓ మహిళ బైకుపై వెళ్లిపోయిందని అక్కడ ఉన్న వారు చెప్పారు. వెంటనే భర్త ప్రభుదాస్‌ గోపాలపురం పోలీసులను ఆశ్రయించాడు. అప్రమత్తమైన పోలీసులు సీసీ పుటేజీను పరిశీలించారు. ఓ ఆజ్ణాత వ్యక్తి బైకుపై వెళుతున్నట్లు సిసి పుటేజీలో కనిపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరూ..? ఆమెను ఎందుకు బైక్ పై తీసుకువెళ్ళాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


Latest News
తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు Sat, May 08, 2021, 04:07 PM
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM