'బ్యాక్ డోర్' పాటను ఆవిష్కరించిన వై.ఎస్.షర్మిల
 

by Suryaa Desk |

పూర్ణ ప్రధాన పాత్రలో తేజ త్రిపురాన హీరోగా కర్రి బాలాజీ దర్శకత్వం బి. శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా 'బ్యాక్ డోర్'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అతి త్వరలో విడుదలకు సన్నాహాలు చేసుకుంటోందీ సినిమా. దీనికి ప్రణవ్ స్వరాలు సమకూర్చగా, రవిశంకర్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఇందులోని 'యుగాల భారత స్త్రీని' అనే పల్లవితో సాగే పాటను లోటస్ పాండ్ లో తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి వై. ఎస్. షర్మిల ఆవిష్కరించారు. ఈ సినిమా చక్కని విజయం సాధించి, చిత్ర బృందానికి మంచి పేరు రావాలని ఆమె ఆకాంక్షించారు. 'ఎంతో బిజీ షెడ్యూల్ మధ్య తమకు సమయం కేటాయించి... పాటను విడుదల చేయడంతో పాటు తమను అభినందించిన షర్మిలగారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని నిర్మాత బి. శ్రీనివాస్ రెడ్డి, దర్శకుడు బాలాజీ, సహ నిర్మాత ఊట శ్రీను, చిత్ర సమర్పకులు సెవెన్ హిల్స్ సతీష్ కుమార్, చిత్ర కథానాయకుడు తేజ త్రిపురాన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్సార్ సీపీ నాయకురాళ్లు ఇందిరా శోభన్, ఇందూజా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Latest News
తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు Sat, May 08, 2021, 04:07 PM
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM