రైలు ఢీకొని కార్మికుడు మృతి
 

by Suryaa Desk |

మంచిర్యాల జిల్లా ఎంసీసీ సిమెంట్ కంపెనీలో పనిచేస్తున్న గుండెల్లి లక్ష్మణ్ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు బుధవారం రైలు కింద పడి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. ఎంసీసీ కంపెనీలో వంట మనిషిగా విధులు నిర్వహిస్తున్న లక్ష్మణ్ రోజు మాదిరిగా డ్యూటికి వెళుతున్నానని ఇంట్లో నుండి బయలుదేరి తాండూరు మండలం రేపల్లె వాడలోని సెయింట్ థెరిస్సా పాఠశాల సమీపంలోని రైల్వే ట్రాక్ పై మృతుని చెంది ఉన్నాడు. రైల్వే ట్రాక్ దాటుతున్న క్రమంలో రైలు ఢీకొని లక్ష్మణ్ మృతి చెందాడని రైలు లోకో పైలట్ ధృవీకరించినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ సురేష్ గౌడ్ తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.


Latest News
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM
రైల్వే ఉద్యోగి దారుణ హత్య.. Sat, May 08, 2021, 12:44 PM