శంషాబాద్ విమానాశ్రయంలో 1.2 కేజీల బంగారం పట్టివేత

byసూర్య | Wed, Apr 07, 2021, 12:40 PM

దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున బంగారం పట్టుబడుతోంది. విదేశాల నుంచి వస్తున్న వారు అక్రమంగా.. రహస్యంగా బంగారాన్ని తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడుతున్నారు. తాజాగా హైదరాబాద్ శంషాబాద్‌ విమానాశ్రయంలో మరోసారి పెద్ద మొత్తంలో బంగారం పట్టుబడింది. కేరళలోని కొచ్చి నుంచి హైదరాబాద్‌ వస్తున్న ఓ ప్రయాణికుడు బంగాన్ని తీసుకువస్తున్నాడన్న పక్కా సమాచారం మేరకు అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఓ ప్రయాణికుడి నుంచి రూ.60లక్షల విలువైన 1.2 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు కస్టమ్స్‌ అధికారులు వెల్లడించారు. అయితే ఈ బంగారం దుబాయ్ నుంచి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చిన బంగారం ఎవరికి ఇచ్చేందుకు తెచ్చారు.. ఎలా తెచ్చారు అన్న విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.


 


 


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM