సర్టిఫికెట్లు ఇవ్వమంటే అసభ్యప్రవర్తన...!
 

by Suryaa Desk |

సర్టిఫికెట్లు ఇవ్వండి.. ఇంటికి వెళ్తామన్న విద్యార్థిని (16), ఆమె పిన్ని పట్ల సంస్థ డైరెక్టర్‌ అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎల్బీ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సాయినగర్‌ కాలనీలో డాక్టర్‌ జీ మెడికల్‌ ఐఐటీ అకాడమీ కరోనా సమయంలోనూ హాస్టల్‌ నిర్వహిస్తోంది. ఆ అకాడమీలో విద్యార్థిని ఇంటర్‌ పూర్తిచేసి, మెడిసిన్‌ ప్రవేశ పరీక్షకు ప్రిపేర్‌ అవుతోంది. అయితే విద్యార్థిని ఫీజు విషయంలో అకాడమీ వారితో గొడవలు జరుగుతుండేవి. డైరెక్టర్‌ జగన్ ‌యాదవ్‌ స్టడీ అవర్స్‌లో తనతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడని బాధితురాలు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌హెచ్‌ఓ అశోక్ రెడ్డి తెలిపారు.


Latest News
హైదరాబాద్ లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం.. నేలకూలిన చెట్లు, విద్యుత్ స్థంభాలు Sun, May 16, 2021, 05:39 PM
ఈటల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా సానుభూతి.! Sun, May 16, 2021, 04:52 PM
లాక్‌డౌన్ నిబంధనలతో అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో రాకపోకలు నిలిపివేత Sun, May 16, 2021, 04:02 PM
వీణవంకలో ఈటల, టీఆర్‌ఎస్ వర్గీయులకు మధ్య ఘర్షణ Sun, May 16, 2021, 03:42 PM
వరుసగా ఆరు చైన్ స్నాచింగ్‎లు..బయాందోళనలో స్త్రీలు Sun, May 16, 2021, 03:28 PM