దారుణం.. కన్నతండ్రే చంపేశాడు
 

by Suryaa Desk |

తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. శంషాబాద్ మండలం తొండుపల్లిలో కన్నతండ్రే తన ఆరు నెలల కొడుకును చంపేశాడు. వివరాల్లోకి వెళితే.. తొండుపల్లికి చెందిన విక్రమ్‌, స్పందన దంపతులకుపెళ్లైన ఆరేళ్ల ఓ బాబు పుట్టాడు. మద్యానికి బానిసైన విక్రమ్‌.. మద్యంమత్తులో రోజూ ఇంటికి వచ్చి భార్యతో గొడవపడేవారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కూడా ఇంట్లో గొడవ చేశాడు. ఆవేశంతో 6 నెలల పసికందును నీటిసంపులో పడేసి మూతపెట్టాడు. దీంతో ఆ చిన్నారి మరణించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని చిన్నారి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు Sat, May 08, 2021, 04:07 PM
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM