ఎమ్మెల్సీ క‌విత పేరుతో ఘరానా మోసం...!
 

by Suryaa Desk |

ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల‌ కవిత పేరుతో ఓ ఇద్దరు మోసాలకు పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి మ‌హేశ్ గౌడ్‌, వినోద్ అనే ఇద్ద‌రు వ్య‌క్తులు మహమ్మద్ అలియాస్ స్వామి అనే వ్యక్తి నుంచి సుమారు రూ.6.50 లక్షలు వసూలు చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఒకటి, వేములవాడలో మ‌రొక డ‌బుల్ బెడ్‌రూం ఇళ్లు అని చెప్పి రెండు తాళాలు అప్ప‌గించారు. మోస‌పోయాన‌ని గ్ర‌హించిన మ‌హ‌మ్మ‌ద్‌ కామారెడ్డి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.


Latest News
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM
రైల్వే ఉద్యోగి దారుణ హత్య.. Sat, May 08, 2021, 12:44 PM
మాస్కులు వాడేట‌ప్పుడు ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి Sat, May 08, 2021, 12:06 PM