ఐపీఎల్‌పై సానియా కీలక వ్యాఖ్యలు
 

by Suryaa Desk |

బీసీసీఐకి (BCCI) బంగారు బాతు వంటిది ఇండియన్ ప్రీమియర్ లీగ్(Indian Premier League). ప్రపంచంలోనే ధనిక బోర్డు అయిన బీసీసీఐని మరింత సంపన్నవంతమైన క్రికెట్ బోర్డుగా మార్చిన ఘనత ఐపీఎల్‌దే. ప్రపంచంలో ఎన్నో క్రికెట్ లీగ్స్ ఉన్నా ఫుట్‌బాల్ లీగ్స్ అంతటి బ్రాండ్ వాల్యూ కేవలం ఐపీఎల్‌కు(IPL) మాత్రమే ఉన్నది. ప్రతీ ఏటా బీసీసీఐ ఆదాయంలో సింహ భాగం ఈ మెగా లీగ్ నుంచే వస్తుందంటే అతిశయోక్తి కాదు. అయితే ఐపీఎల్ కేవలం డబ్బుకోసమేనా? అభిమానులకు ఎంటర్‌టైన్‌మెంట్ అందించడం తప్ప ఇంకేమీ చేయలేదా అంటే కాదనే అంటున్నది టెన్నిస్ స్టార్ (Tennis Star) సానియా మీర్జా(Sania Mirza). ఐపీఎల్ ద్వారా ఎంతో ప్రతిభ వెలుగులోకి వస్తున్నది.. గ్రామీణ, పట్టణ ప్రాంత క్రీడాకారులకు ఇది ఒక మంచి వేదికను కల్పిస్తున్నదని సానియా చెప్పింది. వేర్వేరు సామాజిక నేపథ్యాల నుంచి వచ్చిన క్రీడాకారులు ప్రపంచంలోని మేటీ క్రికెటర్లతో కలసి ఆడేందుకు, వారితో పోటీ పడేందుకు బీసీసీఐ మంచి వేదికను కల్పించిందని సానియా మొచ్చుకున్నది.


 


ఐపీఎల్‌ను స్పూర్తిగా తీసుకొనే బ్యాడ్మింటన్ లీగ్, కబడ్డీ లీగ్, టెన్నిస్ లీగ్, హాకీ లీగ్, ఫుట్‌బాల్ లీగ్ వంటివి ఏర్పడ్డాయి. దీని ద్వారా ఎంతో మంది తమ ప్రతిభను ప్రపంచానికి చాటగలుగుతున్నారని సానియా చెప్పింది. 'పరాజయం నుంచి ఎలా తేరుకోవాలి.. అథఃపాతాళం నుంచి ఎలా పైకి రావాలో ఆటలు నేర్పిస్తాయి. ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకోగల ధైర్యం క్రీడల వల్లే సాధ్యమవుతుంది' అని సానియా మీర్జా వివరించింది. ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్స్ ఫర్ డెవెలెప్‌మెంట్ అండ్ పీస్ సందర్భంగా పార్లమెంటరీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ నిర్వహించిన వర్చువల్ ప్యానల్ చర్చలో సానియా మీర్జా పాల్గొని క్రీడలకు సంబంధించిన విషయాలు వివరించింది.


 


 


Latest News
హైదరాబాద్ లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం.. నేలకూలిన చెట్లు, విద్యుత్ స్థంభాలు Sun, May 16, 2021, 05:39 PM
ఈటల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా సానుభూతి.! Sun, May 16, 2021, 04:52 PM
లాక్‌డౌన్ నిబంధనలతో అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో రాకపోకలు నిలిపివేత Sun, May 16, 2021, 04:02 PM
వీణవంకలో ఈటల, టీఆర్‌ఎస్ వర్గీయులకు మధ్య ఘర్షణ Sun, May 16, 2021, 03:42 PM
వరుసగా ఆరు చైన్ స్నాచింగ్‎లు..బయాందోళనలో స్త్రీలు Sun, May 16, 2021, 03:28 PM