ప్రేమ పేరుతో బాలికను మోసం చేసిన యువకుడు.... !
 

by Suryaa Desk |

ఫేస్ బుక్ లో కొత్త పరియచం ఓ బాలికను నిండా ముంచింది. ఓ యువకుడిని నమ్మిన బాలిక చిరవకు మోసపోయింది. పేట్ బషీరాబాద్‌లో చోటు చేసుకుంది...  సుచిత్ర సెంటర్ కి చెందిన బాలికను సంగారెడ్డి జిన్నారంకు చెందిన రాహుల్(19) అనే యువకుడు పరిచయం చేసుకున్నాడు. చాటింగ్ చేస్తూ మంచి వాడిలా నటించాడు. ప్రేమిస్తున్నాను అని మాయమాటలు చెప్పాడు. ఇందంతా నిజమని నమ్మిన ఆ బాలికను ఓ రోజు తన వెంట స్వగ్రామానికి తీసుకెళ్లాడా యువకుడు. అక్కడ ఆమె పర్సనల్ ఫోటోలను సెల్ ఫోన్ లో తీసుకున్నాడు. ఆ తర్వాత తనలోని అసలు రంగును బయటపెట్టాడు. తాను అడిగినప్పుడల్లా డబ్బు కావాలని లేకుంటే ఈ ఫోటోలు బయటపెడతానంటూ బ్లాక్ మెయిల్ చేస్తూ ఆ బాలిక వద్ద నుండి రూ. 57,000 కాజేశాడు. ఏప్రిల్ 3న ఏకంగా బాలిక తండ్రికి ఫోన్ చేసిన రాహుల్ తనకు డబ్బు ఇవ్వాలని, మీ అమ్మాయి పర్సనల్ ఫొటోస్ నా వద్ద ఉన్నాయి అంటూ బెదిరించాడు. దీంతో తండ్రి నిలదీయడంతో బాలిక అసలు విషయం చెప్పింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.


Latest News
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM
రైల్వే ఉద్యోగి దారుణ హత్య.. Sat, May 08, 2021, 12:44 PM
మాస్కులు వాడేట‌ప్పుడు ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి Sat, May 08, 2021, 12:06 PM