పెరుగుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు...!
 

by Suryaa Desk |

పెరుగుతో ప‌లు అనారోగ్య స‌మస్యలను న‌యం చేసుకోవ‌చ్చు. పెరుగును వేటితో తింటే మంచిదో ఇప్పుడు చూద్దాం.


- జీల‌కర్రను పొడి చేసి దాన్ని ఒక‌ కప్పు పెరుగులో క‌లుపుకుని తింటే త్వరగా బ‌రువు త‌గ్గుతారు.


- కొద్దిగా న‌ల్ల ఉప్పును తీసుకుని పొడి చేసి దాన్ని ఒక‌ క‌ప్పు పెరుగులో క‌లుపుకుని తాగాలి. దీంతో జీర్ణ సంబంధ స‌మస్యలు దూర‌మ‌వుతాయి. ప్రధానంగా గ్యాస్‌, అసిడిటీ వంటి సమస్యలు త‌గ్గుతాయి.


- పెరుగులో కొద్దిగా చ‌క్కెర క‌లుపుకుని తినాలి. దీంతో శ‌రీరానికి వెంట‌నే శ‌క్తి అందుతుంది. మూత్రాశ‌య సంబంధ సమస్యలు కూడా తగ్గుతాయి. వేస‌విలో ఇలా తింటే శ‌రీరానికి చ‌ల్లదనం అందుతుంది.


- కొంత వాము తీసుకుని ఒక‌ క‌ప్పు పెరుగులో క‌లిపి తీసుకోవాలి. దీని వ‌ల్ల నోటి పూత, దంతాల నొప్పి, ఇత‌ర దంత సంబంధ స‌మ‌స్యలు తొలిగిపోతాయి.


- ఒక క‌ప్పు పెరుగులో కొంత న‌ల్ల మిరియాల పొడిని క‌లిపి తినాలి. దీని వ‌ల్ల మ‌ల‌బద్దకం దూర‌మ‌వుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.


- పెరుగులో కొన్ని ఓట్స్ క‌లిపి తింటే మంచి ప్రోబ‌యోటిక్స్‌, ప్రోటీన్లు ల‌భిస్తాయి. అవి కండ‌రాల పుష్టికి దోహ‌దం చేస్తాయి.


- పెరుగులో వివిధ ర‌కాల పండ్లను క‌లిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల శ‌రీర రోగ నిరోధ‌క వ్యవస్థ పటిష్టమవుతుంది. ప‌లు ర‌కాల ఇన్‌ఫెక్షన్లు వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు.


- పెరుగులో కొంత ప‌సుపు, కొంత అల్లం క‌లిపి తినాలి. దీని వ‌ల్ల ఫోలిక్ యాసిడ్ శ‌ర‌రీంలోకి చేరుతుంది. ఇది చిన్నారుల‌కు, గ‌ర్భిణుల‌కు మేలు చేస్తుంది.


- పెరుగులో ఆరెంజ్ జ్యూస్ క‌లిపి తీసుకుంటే శ‌రీరానికి విట‌మిన్ సి ల‌భిస్తుంది. ఇది కీళ్ల నొప్పుల‌ను త‌గ్గిస్తుంది. వృద్ధాప్య ఛాయ‌ల‌ను దూరం చేస్తుంది.


- పెరుగులో తేనె క‌లిపి తీసుకుంటే క‌డుపులో ఉన్న అల్సర్లు పోతాయి. ఈ మిశ్రమం యాంటీ బయోటిక్‌ గా ప‌నిచేస్తుంది. దీని వ‌ల్ల శ‌రీరంలో ఉన్న ఇన్‌ఫెక్షన్లు వెంట‌నే త‌గ్గుతాయి.


Latest News
తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు Sat, May 08, 2021, 04:07 PM
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM