ప్రభుత్వం తీరుపై హైకోర్టు అసంతృప్తి

byసూర్య | Tue, Apr 06, 2021, 01:12 PM

కరోనా కట్టడిపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తెలంగాణ హై కోర్టులో నేడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా కరోనా పరీక్షలు, చికిత్స, వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలపై ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. వీటిని పరిశీలించిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బార్లు, పబ్ లు, థియేటర్ల పై ఆంక్షలు ఎందుకు లేవని ప్రశ్నించింది. ఆర్టీపీసీ పరీక్షలు తక్కువగా చేస్తున్నారని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేయగా.. పరీక్షలను నెమ్మదిగా పెంచుతున్నామని ఏజీ వివరించారు. కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తుంటే ఇంకా నెమ్మదిగా పెంచడం ఏంటని ప్రశ్నించిన ధర్మాసనం.. కరోనా కట్టడి చర్యలతో పాట పలు అంశాలపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.


Latest News
 

వివాహిత మిస్సింగ్ క‌ల‌క‌లం Wed, Apr 24, 2024, 01:10 PM
బోర్లంలో ఇంటింటి ప్రచారం Wed, Apr 24, 2024, 01:08 PM
విద్యుత్తు షాక్‌తో గేదె మృతి Wed, Apr 24, 2024, 01:06 PM
కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ Wed, Apr 24, 2024, 01:04 PM
కార్పొరేషన్ చైర్మన్ కాసులను సత్కరించిన మున్నూరు కాపులు Wed, Apr 24, 2024, 01:01 PM