ఆమె ప్రియుడే హంతకుడు
 

by Suryaa Desk |

జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించినట్లు తెలుస్తోంది.  వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది. మార్చి 30న సిద్దిఖ్‌ ను చంపిన హంతకుడు ఆ మృతదేహాన్ని ఫ్రిజ్ లో దాచాడు. సిద్దిఖ్ భార్య మెకానిక్‌ సయ్యద్‌ మహ్మద్‌ అలీ మధ్య కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం తెలిసిన రుబీనా భార్త ఆమెను నిలదీశాడు. ఇదే విషయంలో కొంత కాలంగా దంపతుల మధ్య గొడవ జరుగుతోంది. దీంతో విషయాన్ని తన ప్రియుడు సయ్యద్‌ మహ్మద్‌ అలీతో చెప్పుకుంది రుబీనా. ఎలాగైనా సిద్దిక్ కు అంతం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో మార్చి 30న సిద్దిక్ తన భార్య పిల్లలను తీసుకుని శ్రీరాంనగర్‌లో ఉంటున్న బావమరిది ఇంటికి వెళ్ళారు. రాత్రి భోజనం అనంతరం 12 గంటల సమయంలో సిద్దిఖ్‌ ఒక్కడే ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ విషయాన్ని తన ప్రియుడికి చేరవేసింది. అదే రోజు అర్థరాత్రి సమయంలో సిద్దిక్ ఇంటికి వచ్చిన సయ్యద్ స్ఫూన్‌ సహాయంతో కిటికీ గ్రిల్స్‌ తొలగించి ఇంట్లోకి చొరబడ్డాడు. షాకబ్జార్‌ తో సిద్దిక్ తలపై బలంగా కొట్టడంతో అతను మరణించాడు. రక్తం కారుతుండటంతో ఫ్రిజ్ లో పెడితే రక్తం గడ్డకడుతుందని భావించి అక్కడ దాచాడు. అనంతరం మృతుడి వాహనం తీసుకుని అక్కడి నుండి పరారయ్యాడు. సీసీ ఫుటేజీ, సెల్‌సిగ్నల్స్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు భార్య గుట్టు రట్టు చేశారు. అలీతో పాటు మృతుడి భార్య రుబీనాను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.


Latest News
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM
రైల్వే ఉద్యోగి దారుణ హత్య.. Sat, May 08, 2021, 12:44 PM
మాస్కులు వాడేట‌ప్పుడు ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి Sat, May 08, 2021, 12:06 PM