బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

byసూర్య | Tue, Apr 06, 2021, 12:20 PM

బీటెక్ రెండో సంవత్సరం బ్యాక్‌లాగ్స్‌ ఉండడంతో చదువులో వెనుకబడిపోయానని మనస్తాపం చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయంలో ఎల్‌బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది.  కృష్ణా జిల్లా పెనుగంచికోడు మండలం, అవనిగండ్లపాడు గ్రామానికి చెందిన దాసరి డేవిడ్‌రాజు సెంట్రల్‌ బ్యాంక్‌ కాలనీలో ఉంటూ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అతని కుమారుడు చందు(21) మంగల్‌పల్లిలోని ఏవీఎన్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. రెండో సంవత్సరంలో అతడికి బ్యాక్‌లాగ్స్‌ ఉన్నాయి. తరచూ అదే విషయం గుర్తు చేసుకుని ఆందోళనకు గురయ్యేవాడు. ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చర్చికి వెళ్లిన అతడి తల్లి భాగ్యమ్మ, సోదరి జాబిలి ఇంటికి చేరుకుని గదిలో ఉన్న అతడిని పిలిచినా పలకకపోవడంతో కిటికీలోంచి చూశారు. అతడు ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని వేళాడుతూ కనిపించాడు. తలుపు బలవంతంగా తెరచి అతడిని కిందకు దించి, 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు, పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించి అతడు మృతి చెందాడని నిర్ధారించారు. చదువులో వెనుకబడ్డాడనే మనస్తాపంతో కుమారుడు చందు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని డేవిడ్‌రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM