విజయశాంతి కీలక వ్యాఖ్యలు
 

by Suryaa Desk |

ప్రముఖ సినీనటి, బీజేపీ నాయకురాలు విజయశాంతి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆమె పలు ఆసక్తికర ట్వీట్లు, పోస్టులు పెట్టారు. తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన సినిమాలపైబీజేపీ నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని సమర్థించని సినిమాలను, ఆ హీరోలను సీఎం కేసీఆర్‌ ఓ అవగాహనతో సపోర్ట్‌ చేసినా.. తాను మాత్రం ఆ సినిమాలను సమర్థించబోను అని స్పష్టం చేశారు విజయశాంతి.అయితే "ఏవో కొన్ని సినిమాలను, కొందరు నటులను తాను మెచ్చుకున్నట్టు, కొన్ని సందర్భాలలో విమర్శించినట్లు పలు యూట్యూబ్‌ ఛానెళ్ళు అబద్ధపు ప్రచారాలతో వాళ్ళు బతికి, తెలంగాణలో ఆ సినిమాలకు పబ్లిసిటీ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ఇంకా చెప్పాలంటే, నాటి మా తెలంగాణ ఉద్యమాన్ని ఆనాడు సమర్ధించని ఏ ఒక్క సినిమా హీరో చిత్రాలను గాని, వ్యక్తులను గాని నేడు కేసీఆర్ గారు ఒక అవగాహనతో సమర్ధిస్తున్న తీరులో తాను మాట్లాడటం ఎప్పటికీ జరగదన్నారు.


వీటిపై తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అడుగుతున్న అభిమానుల అభిప్రాయాలను తీవ్రంగా పరిగణనలోకి తీసుకుందామన్నారు. తాను ఏం చెప్పాలనుకున్నా స్వయంగా మీడియా ద్వారా లేదా సోషల్ మీడియా ద్వారా స్పందిస్తానని ట్వీట్ ద్వారా తెలిపారు విజయశాంతి.


Latest News
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM
రైల్వే ఉద్యోగి దారుణ హత్య.. Sat, May 08, 2021, 12:44 PM