తెలంగాణలో కొత్తగా 1,097 కరోనా కేసులు

byసూర్య | Mon, Apr 05, 2021, 09:42 AM

 తెలంగాణలో కరోనా రెండో దశ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. అంతకంతకూ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అయితే శనివారంతో పోల్చుకుంటే ఆదివారం పాజిటివ్‌ కేసుల సంఖ్య కాస్త తగ్గడం ఊరట కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 43,070 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,097 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 3,13,237కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 8,746 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ బులిటెన్‌ విడుదల చేసింది.తాజాగా కరోనాతో ఆరుగురు మృతి చెందగా.. ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,723కి చేరింది. నిన్న 268 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,458 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. మరోవైపు జీహెచ్‌ఎంసీ పరిధిలోనూ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా 302 కరోనా కేసులు నమోదయ్యాయి.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM