మద్యం మత్తులో యువకుల హల్‌చల్‌..
 

by Suryaa Desk |

మద్యం మత్తులో ఇద్దరు యువకులు హల్‌చల్‌ చేసిన ఘటన కేపీహెచ్‌పీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్‌పీకాలనీలోని పెట్రోల్‌ బంక్‌ సమీపంలో ప్రధాన రహదారిపై సోడాలు అమ్ముకునే వ్యక్తి వద్దకు ఆదివారం రాత్రి ఇద్దరు యువకులు ఇన్నోవా వాహనంలో వచ్చారు. మద్యంలో కలుపుకొనేందుకు నీళ్లు ఇవ్వాలంటూ హంగామా సృష్టించారు. దీంతో సోడాలు అమ్ముకునే వ్యక్తి నీరు ఇచ్చేందుకు నిరాకరించాడు.


కోపోద్రిక్తులైన ఆ యువకులు సోడా బండిలోని సోడాలు, మంచినీటి డబ్బాను కింద పడేశారు. ఆ ఇద్దరు యువకుల్లో ఒకరు తాను పోలీస్‌ అధికారి కొడుకునంటూ ఇన్నోవా వాహనం సైరన్‌ మోగించి భయభ్రాంతులకు గురి చేయగా, సోడాలు అమ్మే వ్యక్తి 100కు డయల్‌ చేశారు. పోలీసులు ఘటన స్థలికి చేరుకుని అరుణ్, శ్రీనివాస్‌లను అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్‌ ఓ పోలీస్‌ అధికారి కుమారుడు కాగా, అరుణ్‌ డాక్టర్‌. వీరిద్దరిపై కేసు నమోదు చేశారు.  


Latest News
హైదరాబాద్ లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం.. నేలకూలిన చెట్లు, విద్యుత్ స్థంభాలు Sun, May 16, 2021, 05:39 PM
ఈటల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా సానుభూతి.! Sun, May 16, 2021, 04:52 PM
లాక్‌డౌన్ నిబంధనలతో అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో రాకపోకలు నిలిపివేత Sun, May 16, 2021, 04:02 PM
వీణవంకలో ఈటల, టీఆర్‌ఎస్ వర్గీయులకు మధ్య ఘర్షణ Sun, May 16, 2021, 03:42 PM
వరుసగా ఆరు చైన్ స్నాచింగ్‎లు..బయాందోళనలో స్త్రీలు Sun, May 16, 2021, 03:28 PM