తెలంగాణకు వర్షసూచన..

byసూర్య | Mon, Apr 05, 2021, 08:26 AM

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆదివారం రోజు ఎండ తీవ్రత మరింత పెరిగింది.. పగటి ఉష్ణోగ్రతలు 36.5 నుంచి 41.9 డిగ్రీల మధ్య నమోదవుతూ బెంబేలెతిస్తున్నాయి.. అయితే, ఇవాళ వాతావరణంలో మార్పులు రానున్నాయని చెబుతున్నారు అధికారులు.. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ పరిసర ప్రాంతాల్లో 2.1 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతుండగా.. ఉత్తర ఇంటీరియర్‌ కర్ణాటక నుంచి ఇంటీరియల్‌ తమిళనాడు వరకు 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఆవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావంతో వరంగల్‌ రూరల్‌, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.. ఇక, ఆదివారం మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో వడగాలులతో ప్రజలు అతలాకుతలం అయినట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.


Latest News
 

రేపే ఆదివారం.. చికెన్, మటన్ షాపులు బంద్ Sat, Apr 20, 2024, 04:03 PM
జనం భారీగా చిలుకూరు ఎందుకు వెళుతున్నారు? Sat, Apr 20, 2024, 03:30 PM
కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు Sat, Apr 20, 2024, 03:22 PM
ఇంద్రవెల్లి నెత్తుటి మరకలకు 43 ఏళ్లు Sat, Apr 20, 2024, 03:21 PM
నత్త నడకన సాగుతున్న పోలోని వాగు వంతెన నిర్మాణం Sat, Apr 20, 2024, 02:43 PM